చేనేతకు చేయూత : జగదీష్ రెడ్డి నేతృత్వంలో పోచంపల్లిలో ప్రజాప్రతినిధుల షాపింగ్‌

చేనేత వస్త్రాలను ఆదరించడంతో పాటు వాటిని కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Bukka Sumabala | Updated : May 25 2020, 01:25 PM
Share this Video

చేనేత వస్త్రాలను ఆదరించడంతో పాటు వాటిని కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించిన జగదీశ్ రెడ్డి స్థానిక చేనేత సహకార సంఘంలోని వస్త్ర నిల్వలను పరిశీలించారు. నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విక్రయాలు ఆగిపోయి వస్త్ర నిల్వలు పేరుకుపోయాయని, చేనేతను ఆదుకోవడానికి తమవంతు సాయంగా ప్రజాప్రతినిధులంతా నేత వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఆయనతో పాటు బడుగుల లింగయ్యయాదవ్‌, కర్నె ప్రభాకర్‌, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, గాదరి కిశోర్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి,  కుటుంబ సభ్యులతో కలిసి చేనేత సహకార సంఘంలో వస్త్రాలు కొనుగోలు చేశారు. 

Related Video