వలసకూలీలతోనే కరోనా.. జాగ్రత్తగా ఉండాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు...
నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామ పంచాయతీని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
నెల్లికుదురు మండలం మునగలవీడు గ్రామ పంచాయతీని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మునగలవీడు పంచాయతీలో మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేసి పంచాయతీ నిర్వహణపై పలు సూచనలు చేశారు. బొజ్జన్నపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. వారికి రోజు కూలీ కనీసం రూ.200 పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మంత్రికరోనా నేపథ్యంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే చేతిరుమాలు, కండువాలు ముఖాలకు ముసుగుగా ధరించాలని చెప్పిన మంత్రిభౌతిక దూరం పాటిస్తూ, పనులు చేయాలని, పనులు చేసే చోట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.