Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మను నెత్తినెత్తిన పంచాతీరాజ్ మంత్రి... సొంత నియోజకవర్గంలో ఎర్రబెల్లి సందడి

వరంగల్ :  తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సామాన్య ప్రజానీకంతో ఇట్టే మమేకం అవుతుంటారు. 

వరంగల్ :  తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సామాన్య ప్రజానీకంతో ఇట్టే మమేకం అవుతుంటారు. ఇలా తన సొంతనియోజకవర్గం పాలకుర్తిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మను నెత్తినెత్తుకున్నారు. ర్యాలీగా చీరల పంపిణి కోసం ఏర్పాటుచేసిన సభాస్థతికి వెళుతున్న క్రమంలో మహిళల దగ్గరున్న బతుకమ్మను తీసుకుని నెత్తిన పెట్టుకుని మంత్రి ఎర్రబెల్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అనంతరం వేదికపైకి చేరుకుని వివిధ మండలాల్లోని గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరలు అందచేసారు మంత్రి ఎర్రబెల్లి.