సంగారెడ్డిలో దారుణం... పెదనాన్న తలనరికి ఊళ్ళో తిరుగుతూ యువకుడి హల్ చల్

సంగారెడ్డి : సొంత పెదనాన్నను ఓ యువకుడు అతి కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.

Share this Video

సంగారెడ్డి : సొంత పెదనాన్నను ఓ యువకుడు అతి కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పెదనాన్న తల నరికిన యువకుడు దాన్ని వెంటపెట్టుకుని తిరుగుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించాడు. చివరకు అతడే నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.జహిరాబాద్ సమీపంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన బండమీది చంద్రయ్య, రత్నం అన్నదమ్ములు. వీరి మధ్య వ్యవసాయ భూమి పంపకం విషయంలో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నారు. అయితే రత్నం కొడుకు రాకేష్ తమకు అన్యాయం చేస్తున్న పెదనాన్నపై కోపం పెంచుకుని తాజాగా దారుణానికి ఒడిగట్టాడు. చంద్రయ్య పొలం నుండి వస్తుండగా అడ్డుకున్న రాకేష్ పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. చంద్రయ్య తలను శరీరం నుండి వేరుచేసి దాన్ని పట్టుకుని ఊరంతా తిరుగుతూ వీడియోలు తీసుకున్నాడు. పెదనాన్నను ఎందుకు చంపాడో వివరిస్తూ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు నిందితుడు రాకేష్. ఈ దారుణం జహిరాబాద్ నియోజకవర్గంలో కలకలం  రేపింది. 

Read More

Related Video