userpic
user icon

చిలుకూరు అడువుల్లోకి పారిపోయిన చిరుత.. అటవీశాఖ నిర్థారణ..

Bukka Sumabala  | Published: May 16, 2020, 12:18 PM IST

గురువారం నుండి అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత చిలుకూరు అడవుల వైపు వెళ్లింది. తాజాగా రాజేంద్రనగర్ మండలంలోని హిమాయత్ సాగర్‌లో చిరుత నీళ్లు తాగుతుండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బోనులో చిక్కకుండా, డ్రోన్లు, కెమెరాల కంట పడకుండా తప్పించుకున్న చిరుత అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఫామ్ హౌస్ ఏరియాలో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు గాలించగా.. ఏడు అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి దూకి తప్పించుకొని పారిపోయింది. పాద ముద్రల ద్వారా చిరుత గోడ దూకి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు.ఇప్పటి వరకు 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు.. 4 సార్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు జరిపారు. 2 మేకలను ఎరగా వేశారు. 10 కుక్కలను చిట్టడవిలోకి పంపారు. కానీ చిరుత జాడ మాత్రం లభ్యం కాలేదు. అయితే తాజాగా ఈ  చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Read More

Video Top Stories

Must See