టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు: భర్త ఇతనే, అరెస్ట్
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె అత్తామామలు పరారీలో ఉన్నారు.
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె అత్తామామలు పరారీలో ఉన్నారు. భర్త వేంకటేశ్వర రావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న అత్త రమాదేవి, మామ మల్లాది సుబ్బారావుకోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భర్త వెంకటేశ్వర రావు ప్రవర్తన, అతని అక్రమ సంబంధాలతో విసిగిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది.