మునుగోడులో దూకుడు పెంచిన బిజెపి... హైదరాబాద్ శివారులో కీలక మీటింగ్
హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బిజెపి దూకుడు పెంచింది.
హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బిజెపి దూకుడు పెంచింది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఎలాగయినా గెలిపించుకుని మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపాధి, వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి వివిధ కారణాలతో హైదరాబాద్ లో నివాసముంటున్న మునుగోడు ప్రజలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మల్యే ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ శివారులోని తార పంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో మునుగోడు వాసులు భారీగా పాల్గొన్నారు.