Asianet News TeluguAsianet News Telugu

లారీ డ్రైవర్ పై చిరుత దాడి.. కాటేదాన్‌, బుద్వేల్‌ లో హై అలర్ట్

రంగారెడ్డి జిల్లా, కాటేదాన్ లో గాయపడి రోడ్డుమీది కొచ్చిన చిరుత అక్కడినుండి పారిపోయింది.

రంగారెడ్డి జిల్లా, కాటేదాన్ లో గాయపడి రోడ్డుమీది కొచ్చిన చిరుత అక్కడినుండి పారిపోయింది.. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని,  కాటేదాన్‌, బుద్వేల్‌ వాసులు బయటకు రావొద్దని సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు. అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైపు నుంచి చిరుత వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు అని డీసీపీ పేర్కొన్నారు.