దేశ రక్షణ కోసం... తెలంగాణ ఆర్మీ జవాన్ వీరమరణం
హైదరాబాద్: దేశ రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు.
హైదరాబాద్: దేశ రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. లడక్ లోని లేహ్ లో ఆర్మీ లో హవల్ధార్ గా పనిచేస్తున్న పరుశురాం డ్యూటీలో వుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండల కింద చిక్కుకున్న అతడు అక్కడికక్కడే మరణించాడు.మృతుడు పరశురాంది మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తాండ. దేశసేవ కోసం ఆర్మీలో చేరిన అతడు తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు.