Asianet News TeluguAsianet News Telugu

అసలేమైంది... 9 మంది మరణం వెనక వాస్తవం....?

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడిన బావిలో ఏకంగా 9 మంది మృతదేహాలు బయటపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడిన బావిలో ఏకంగా 9 మంది మృతదేహాలు బయటపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి పనులు చేసుకుంటున్న మక్సూద్ కుటుంబ సభ్యులు మొత్తం శవాలై తేలారు. హత్యలా, ఆత్మహత్యలా అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు కాస్తా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.