Asianet News TeluguAsianet News Telugu

సైబర్ నేరగాళ్ల మోసానికి యువరైతు ఆత్మహత్య


ఆన్ లైన్ లో రుణం తీసుకుని చెల్లింవటం లేదంటూ  సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో  రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు.  

Oct 10, 2020, 2:04 PM IST

ఆన్ లైన్ లో రుణం తీసుకుని చెల్లింవటం లేదంటూ  సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో  రైతు ఆత్మ హత్య చేసుకున్నాడు .  జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ చెందిన ఎడమల రామ్మోహన్ రెడ్డి  28 ఏళ్ల  యువ రైతుకు గుర్తు తెలియని ఆగంతకుల నుంచి గత వారం రోజులుగా తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.నేను రుణం తీసుకోలేదని చెప్పిన తరసు బెదిరింపుల ఫోన్ రావడంతో ఫోన్ నంబర్ మార్చాడు.అయినా అతని కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు రావడంతో రామ్మోహన్ రెడ్డి  గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు