Asianet News TeluguAsianet News Telugu

ఈటెల మతి భ్రమించి మాట్లాడుతున్నాడు : బీఆర్ఎస్ నేత జివి రామకృష్ణారావు

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఆరోపించారు. 

First Published Apr 26, 2023, 4:50 PM IST | Last Updated Apr 26, 2023, 4:50 PM IST

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈటెల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. తమ పై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.  ఇసుక రీచ్ పై ఈటెల రాజేందర్ కు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తండ్రి పై మాట్లాడే అర్హత నీకు ఉందా అన్నారు . దొంగ భూములను ఆక్రమించుకున్న  నీకు దరణీ పోర్టల్ ఎలా నచ్చుతుందని ఎద్దేవా చేశారు.  బిజెపి పాలిస్తున్న రాష్ట్రంలో రైతులకు ఎంత నష్ట పరిహారం ఇచ్చారో చెప్పాలని సూటిగా ఈటెలను ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని.. అందుకే పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.