లిక్కర్ స్కాంలో సీఎం కూతురు... కవిత రాజీనామా చేయాలి: పొన్నం ప్రభాకర్ డిమాండ్
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు డిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నమోదయ్యిందని..
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు డిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నమోదయ్యిందని.. ఇలాంటిది టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కు లేదని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కానీ ఆమె నిస్సిగ్గగా మాట్లాడుతున్నారని... బాధ్యతారాహిత్యంగా బయటకు వచ్చి ఏం చేస్తారు... అరెస్ట్ చేస్తే చేసుకోని అంటూ మాట్లాడటం దారుణమన్నారు. సిగ్గiలేకుండా అరెస్ట్ చేస్తే చేసుకోండి అన్నారంటే ఎంతకు దిగజారారో అర్థమవుతుందని అన్నారు. కవిత పేరు లిక్కర్ స్కాం లో బయటపడగానే నైతిక బాధ్యతగా ప్రభుత్వం స్పందించాల్సిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. 'నేను కొట్టినట్లు నువ్వ ఏడ్చినట్లు వుండాలి' అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పొన్నం అన్నారు. టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోవడమే కాదు ఆప్ ను కూడా ఈ అవినీతి కూపంలోకి లాగిందన్నారు. భూములు, ఇసుక, గనుల పేరుమీదే కాదు వీస్కీల పేరుమీద సంపాదిస్తున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.