సీఎల్పీ బృందం దుమ్ముగూడెం పర్యటనలో ఉద్రిక్తత... పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం

దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పర్యటనకు బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని మంగళవారం నాడు  పోలీసులు భద్రాచలం వద్ద అడ్డుకున్నారు. 

First Published Aug 16, 2022, 6:25 PM IST | Last Updated Aug 16, 2022, 6:25 PM IST

దుమ్ముగూడెం ప్రాజెక్ట్ పర్యటనకు బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని మంగళవారం నాడు  పోలీసులు భద్రాచలం వద్ద అడ్డుకున్నారు. దుమ్ముగూడెం మావోయిస్టు ప్రాబల్యం కలిగిన ప్రాంతం కావడంతో భద్రతాకారణాల రిత్యా కాంగ్రెస్ బృందాన్ని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తమను అడ్డుకున్న పోలీసుల తీరుపై కాంగ్రెస్ బృందం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజులు ముందుగానే సీఎల్పీ పర్యటనపై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని... అయినా ఎందుకు తమకు రక్షణ ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు బయటపడతాయని ప్రభుత్వమే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తమను దుమ్ముగూడెం ప్రాజెక్ట్ వద్దకు అనుమతించాలని కోరుతూ సీఎల్పీ బృందం ఆందోళన చేపట్టింది.