కరీంనగర్ లో విషాదం ... రైతును బలితీసుకున్న జోడెడ్లు

కరీంనగర్ : ఎడ్ల బండితో సహా రైతు ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతయిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Share this Video

కరీంనగర్ : ఎడ్ల బండితో సహా రైతు ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతయిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. చొప్పదండికి చెందిన రైతు పొన్నం రాజేశం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల అతడు వ్యవసాయ పనులకోసం కొత్తగా ఎడ్లను కొనుగోలు చేసాడు. ఈ క్రమంలోనే బండిపై వెళుతుండగా ఎడ్లు బెదరడంతో ఘోరం జరిగింది. బండితో సహా రైతు రాజేశం ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కిలోమీటర్ దూరం కొట్టుకుపోయి ఎడ్లు మృతిచెంది లభ్యమవగా రైతు ఆఛూకీ మాత్రం దొరకలేదు. రైతు కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశించారు.

Related Video