తక్కువ ధరలో.. ఎక్కువ సౌకర్యం.. కార్గో సేవల్లో టీఎస్ఆర్టీసీ..

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రజలకు వినూతన సేవలు చేయడానికి నూతనంగా కార్గో పార్సిల్ సర్వీసెస్ ప్రారంభించింది. 

First Published Jun 20, 2020, 10:48 AM IST | Last Updated Jun 20, 2020, 10:48 AM IST

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రజలకు వినూతన సేవలు చేయడానికి నూతనంగా కార్గో పార్సిల్ సర్వీసెస్ ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల్లో ఈరోజు ఈ నూతన సర్వీసును ప్రారంభించింది. సుమారు 26 బస్సుల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వేగంగా, భద్రంగా, మీ చేరువలోకి అనే నినాదంతో ఈ కార్గో పార్సెల్ సర్వీస్ ను వ్యవస్థను నడిపిస్తామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఎక్కడి వరకి వెళ్లగలిగే ప్రాంతాలు ఉన్నాయో అక్కడి వరకూ ఈ సర్వీసులు అందిస్తామని, కరీంనగర్ గోదావరిఖని జగిత్యాల లో 24 గంటలు సేవలు అందిస్తామని, త్వరలో ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తక్కువ ధరలతో ఎక్కువ సౌకర్యాలు కల్పించే ఆర్టీసీ సంస్థ లో ప్రజలందరూ భాగస్వాములై వారికి సంబంధించిన పాలసీలను నేరుగా బుక్ చేసుకొని సేవలను వినియోగించుకోవాలని కోరారు.