బిఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కు అండగా ఆర్ఎస్ ప్రవీణ్...

జగిత్యాల : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతం అవుతూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

First Published Feb 9, 2023, 12:05 PM IST | Last Updated Feb 9, 2023, 12:05 PM IST

జగిత్యాల : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతం అవుతూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శ్రావణికి బహుజన సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. జగిత్యాలలోని మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ... భోగ శ్రావణికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు, జగిత్యాల సంజయ్ సొత్తు కాదని... ఇది వాళ్లు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన శ్రావణితో రాజీనామా చేయించడం దారుణమని అన్నారు. జగిత్యాలలొ గడీల పాలన నడుస్తోందని... ఈ రాచరికానికి తెరదించాలని ఆర్ఎస్ ప్రవీణ్ సూచించారు