ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ... ఈడి విచారణకు గైర్హాజరుపై రోహిత్ రెడ్డి క్లారిటీ

 హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ (మంగళవారం) ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు గైర్హాజరయ్యారు.  

First Published Dec 27, 2022, 4:25 PM IST | Last Updated Dec 27, 2022, 4:25 PM IST

 హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇవాళ (మంగళవారం) ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు గైర్హాజరయ్యారు.   ఇలా ఈడి ముందుకు వెళ్లకపోవడానికి గల కారణాలను తాండూరు ఎమ్మెల్యే వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఈడి పరిధిలోకి రాదని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసామని... ఈ పిటిషన్ రేపు(బుధవారం) హై కోర్టులో బెంచ్ ముందుకు విచారణకు రానుందని పేర్కొన్నారు. ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు కాబట్టి ఈడి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందో తెలియడంలేదని.... అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని అన్నారు. ఇప్పటికయితే ఈడి విచారణకు హాజరవ్వాలో లేదో నిర్ణయించలేదని... న్యాయవాదులతో సమావేశం అనంతరం ఏం చేయాలో నిర్ణయిస్తానని రోహిత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత హాజరును సూచిస్తే అలాగే చేస్తాను... లేదంటే తన ప్రతినిధి ద్వారా లేఖ పంపాలా, ఈమెయిల్ పంపించాలా అన్నది నిర్ణయిస్తానని అన్నారు. నందకుమార్ సాయంతో నన్ను ఈ కేసులో ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.