Asianet News TeluguAsianet News Telugu

లక్షల కోట్ల బడ్జెట్ కాదు... నెలా నెలా ఫస్ట్ కి జీతాలివ్వండి..: బడ్జెట్ పై ఈటల సెటైర్లు

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన ప్రసంగంపై మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రెండు లక్షల తొంబై కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం కాదు... 

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన ప్రసంగంపై మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రెండు లక్షల తొంబై కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం కాదు... ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటివారంలో జీతాలివ్వండి అంటూ ఎద్దేవా చేసారు. కనీసం జీతభత్యాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ సర్కార్ వుందని... ఇదేం గొప్పతనమో ఆర్థిక మంత్ర హరీష్ రావు చెప్పాలని ఎమ్మెల్యే ఈటల అన్నారు. ఇక తెలంగాణలో విద్యావ్యవస్థను ఉద్దరించామని చెబుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం... హైదరాబాద్ నడిబొడ్డును బాత్రూంల కోసం సర్కారు బడిలో చదివే అమ్మాయిల రోడ్డెక్కడం గురించి మాట్లాడాలని ఈటల సూచించారు. చదువులతల్లి నిలయమైన బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఆందోళనలకు దిగారంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ ఇంత అద్వాన్నంగా వుంటే తామేదో మార్చేసినట్లు హరీష్ అసెంబ్లీలో గొప్పగా ప్రకటనలు చేసారంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

Video Top Stories