Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ... మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జె సూర్య

హైదరాబాద్ :  తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని కాపాడేందుకు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవoతంగా కొనసాగుతోంది.

హైదరాబాద్ :  తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని కాపాడేందుకు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవoతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి మరో ముగ్గురిని మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలా తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య కూడా ఈ ఛాలెంజ్ కు ఒప్పుకుని మొక్కలు నాటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో సూర్య మొక్క నాటారు.  

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందాన్నిస్తోందని సూర్య తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట అద్భుత కార్యాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరినీ మొక్కలునాటే కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైమా, ఇయనతో  పాటు రాజ్ మొక్కలు నాటాలంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు ఆర్జే సూర్య. 
 

Video Top Stories