Asianet News TeluguAsianet News Telugu

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం... కళ్లు చెదిరే అద్భుత నిర్మాణం

తెలంగాణాలో నేడు ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. 

First Published Apr 14, 2023, 9:53 AM IST | Last Updated Apr 14, 2023, 9:53 AM IST

తెలంగాణాలో నేడు ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. మన రాష్ట్ర సిగలో మరో మణిహారం చేరనున్నది. హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే  ఎత్తయిన అంబేద్కరుడి విగ్రహ ఆవిష్కరణకు సిద్ధమైంది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ చారిత్రక నిర్మాణ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరుగనున్నది. అంబరాంటే అంబేద్కరుడి సంబురం కోసం తెలంగాణ సమాజమే కాదు.. యావత్తు భారతం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నది. ఈ ఉద్విగ్న భరిత ఘట్టంతో యావత్ దేశం పులికించిపోనున్నది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ విగ్రహం డ్రోన్ వ్యూ, దీపకాంతుల్లో మెరిసిపోతున్న వ్యూ మీకోసం..!