వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలహీనతను ఆసరా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయాలకు తెర తీశారు. 

Share this Video

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలహీనతను ఆసరా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయాలకు తెర తీశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొని తాము దాన్ని తీసుకుంటామని ఆయన వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని వైఎస్ జగన్ మాత్రమే కాకుండా ఏపిలోని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎదిరించలేని స్థితిలో ఉన్నారు. దీంతో బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని ఎదుర్కునే దమ్ము, ధైర్యం బిఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేసిఆర్ చాటదలుచుకున్నారు.