రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రాజ్యసభకు తమ తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రాజ్యసభకు తమ తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరు తెలంగాణ వ్యక్తులను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను ఆయన రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. నిరంజన్ రెడ్డిని ఎంపిక చేసుకోవడంలో ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేయడంలో మర్మమేమిటనేది తెలియదు. అలాగే, కేసీఆర్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు. వారిలో దామోదర రావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. మిగతా ఇద్దరు గాయత్రి రవి, పార్థసారథి రెడ్డిల ఎంపికలో వ్యూహ్యం చాలా బలమైందిగా కనిపిస్తోంది.