జగన్ తో ఢీ: చంద్రబాబుతో జత కట్టేందుకు పవన్ కల్యాణ్ రెడీ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. 

First Published May 13, 2022, 11:00 AM IST | Last Updated May 13, 2022, 11:25 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అప్పుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీలోని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటి మీదికి రావాలనే ప్రతిపాదన ముందుకు వస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీతో కలిసేది లేదని చెబుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్ ను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఆశ్చర్యం లేదు.