చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కొరుకుడుపడని కొయ్యగానే మారారు.
తెలంగాణలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి కొరుకుడుపడని కొయ్యగానే మారారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి ఆయన ఏదో రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. అన్ని వేళల్లోనూ ఆయనను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం మాత్రమే చేస్తోంది తప్ప ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోంది. దానికి కారణమేమిటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహం ఏమిటి చూద్దాం.