కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారనే వాతావరణం ఏర్పడింది. 

First Published Mar 10, 2023, 11:01 AM IST | Last Updated Mar 10, 2023, 11:01 AM IST

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారనే వాతావరణం ఏర్పడింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ను ఆధారం చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడి కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 11 మంది అరెస్టయ్యారు. కవిత ఈ నెల 11వ తేదీన ఈడి ముందు హాజరు కానున్నారు. కవిత ప్రతినిధిగా లిక్కర్ కుంభకోణంలో వ్యవహరించాడని చెబుతున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై ప్రస్తుతం ఈడి కస్టడీలో ఉన్నాడు. రామచంద్ర పిళ్లైను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడి అధికారులు ప్రశ్నలు సంధిస్తారని భావిస్తున్నారు. ఈ స్థితిలో కవితను ఈడి అరెస్టు చేస్తే ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానాలు వెతుకుదాం...