నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరి పరిస్థితి విషమం..

ఏపీలో వరుస గ్యాస్ లీక్ ఘటనలు, పారిశ్రామిక అగ్ని ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. 

Share this Video

ఏపీలో వరుస గ్యాస్ లీక్ ఘటనలు, పారిశ్రామిక అగ్ని ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవకముందే నెల్లూరులో ఓ  కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం చంద్ర పడియా  గ్రామంలో ఉన్న వెంకటనారాయణ కెమికల్ ఫ్యాక్టరీలో మెథనల్ అనే సాల్వెంట్ ను రియాక్టర్లు లో లోడ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మొదటి అంతస్తు గోడలు కూలి నలుగురు గాయపడ్డారు. తర్వాత ఫైర్ కంట్రోల్ చేసినట్లు హెచ్ఆర్ రామకృష్ణ తెలిపారు. గాయపడిన వారిని నెల్లూరు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

Related Video