Asianet News TeluguAsianet News Telugu

మధ్య ప్రదేశ్ లో ఘోరం... ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దుర్మార్గుడు

 ఓ దుర్మార్గుడు ప్రియురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 

First Published Dec 25, 2022, 2:33 PM IST | Last Updated Dec 25, 2022, 2:33 PM IST

 ఓ దుర్మార్గుడు ప్రియురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. వెంటపడి మరీ ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవాలని కోరేసరికి ఉన్మాదిలా మారాడు. నడిరోడ్డుపై యువతిని నేలపై పడేసి అత్యంత క్రూరంగా చితకబాదుతూ, కాలితో తంతూ అమానవీయంగా వ్యవహరించాడు. ప్రియుడి దాడితో యువతి స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా కొందరు ఆమెను కాపాడేప్రయత్నం చేసారు. ఇలా యువతిని ప్రియుడు కొడుతుండగా వీడియో తీసినవారు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారి పోలీసులకు చేరడంతో సదరు దుర్మార్గున్ని అరెస్ట్ చేసారు.