ట్రాఫిక్ కి చెక్ పెట్టండిలా...(వీడియో)
మీరు ఉద్యోగం చేస్తారా? చాలా దూరం ప్రయాణించి రోజూ ఆఫీసుకు వెడతారా? అయితే మీకు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అనుభవం ఉండే ఉంటుంది? కొన్నిసార్లు గంటలకొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కుని నరకం చూసి కూడా ఉంటారు. రోజువారీ కార్యక్రమంలో ఇది తప్పనిసరి అయినప్పుడు దీన్నే మనకనువుగా మార్చుకుంటే ఎలా ఉంటుంది. ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయాన్ని చక్కగా మేనేజ్ ఎలా చేసుకోవచ్చో చూద్దామా...

1. మీ ఫోన్ లో రేడియో ఆన్ చేసుకోండి. మీ కిష్టమైన స్టేషన్ ట్యూన్ చేసుకుని పాటలు ఎంజాయ్ చేయండి. రేడియోలో కంటే మీ దగ్గరే మంచి ప్లేలిస్ట్ ఉంటే అదైనా సరే..చక్కగా మంచి పాటలు ఆస్వాదించండి. సీటులో రిలాక్స్ డ్ వెనక్కి ఒరిగి కూర్చుని ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు పాటలు వినేయండి. మీకు పాటలు మరీ నచ్చితే వాటితో పాటు గొంతు కలపండి. అయితే ఇది కారు అయితేనే బాగుంటుంది. పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్స్ లో వెళ్లేప్పుడు గట్టిగా పాడితే పక్కవారు ఇబ్బందిపడే ప్రమాదం ఉంది.
2. రోజుమొత్తంలో మీరేం పనులు చేయాలనుకున్నారు, ఎంతవరకు పూర్తి చేశారు ఒక లిస్ట్ రాసుకోండి. రోజు కాకపోతే వారానికి మీరు పెట్టుకున్న టార్గెట్స్ పూర్తయ్యాయా చెక్ చేసుకోండి. ఎప్పటినుండో చేయాలనుకుని మర్చిపోతున్న విషయాల మీద ఫోకస్ పెట్టండి. దీనివల్ల టైమూ కలిసివస్తుంది..దాంతోపాటు ఇకముందు పనులు మరిచిపోకుండా, సులువుగా ఎలా చేసుకోవచ్చో తెలిసిపోతుంది.
3. రోజువారీ బిజీ జీవితంలో తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా ఉండడం లేదు. సో ఈ ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయాన్ని దానికి ఉపయోగించండి. మీ తల్లిదండ్రులకు లేదా ఎప్పుటినుండో చేయాలని మరిచిపోతున్న క్లోజ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడండి. అయితే రోడ్డుమీద దృష్టి పెట్టడం మరిచిపోవద్దు.
4. ఎప్పటినుండో చదవాలనుకుని వెంటపెట్టుకుని తిరుగుతున్న పుస్తకాన్ని చదివేయండి. 10,15 ని.లు ట్రాఫిక్ జాం అవ్వబోతుందని అర్థమైనప్పుడు పుస్తకం చదవడం కంటే చక్కటి ప్రత్యామ్నాయం మరొకటి లేదు.