
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు
కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్రమైన మకరవిలక్కు ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో జరిగే ఈ ఉత్సవం శబరిమల ఆలయానికి అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.