Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిమల... పోటెత్తిన అయ్యప్ప మాలధారులు

శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. 

First Published Dec 14, 2022, 5:06 PM IST | Last Updated Dec 14, 2022, 5:06 PM IST

శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. అయ్యప్ప మాలధారులతో పాటు సాధారణ భక్తులు కూడా శబరిమలకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రోజురోజుకు భక్తుల తాకిడి రోజురోజుకు మరింత పెరుగుతోంది. అయ్యప్ప మాలధారులు ఇరుముడితో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచిచూస్తున్నారు. ప్రస్తుతం పంబా నుంచే క్యూలైన్లు మొదలవడంతో దాదాపు 15 గంటల సమయం పడుతోంది. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమల దద్దరిల్లుతోంది.