Mahakumbh: కుంభమేళాలో విదేశీ భక్తులు.. మన సంస్కృతి గురించి ఏమన్నారంటే? | Prayagraj | Asianet Telugu
మాఘ పూర్ణిమ సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి పుణ్య నదీ స్నానాలు చేస్తున్నారు. మాఘ మేళా సందర్భంగా సోమవారం 48.83 మిలియన్లకు పైగా భక్తులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మేళా మైదానాలను మొత్తం 38.83 మిలియన్ల మంది యాత్రికులు సందర్శించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న కల్పవాసీల సంఖ్య 10 మిలియన్లు దాటింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు కొనసాగే కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. విదేశీ భక్తులు సైతం ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పాల్గొని పరవశించిపోతున్నారు.