బిపిన్ రావత్ జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క సమాధానం
బిపిన్ రావత్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మరించుకుంటోంది.
బిపిన్ రావత్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మరించుకుంటోంది. హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దేశనికి ఎంతో సేవ చేశారు. సుధీర్ఘ కాలం పాటు దేశ రక్షణకు పాటుపడ్డాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారన్న వార్త దేశం మొత్తం కలకలం సృష్టించింది. దేశ పార్లమెంట్ ఆయనకు నివాళి అర్పించింది. ఈ రోజు బిపిన్ రావత్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. బిపిన్ రావత్ వీరమరణం పొందినా.. ఆయన జ్ఞాపకాలను దేశం మొత్తం గుర్తు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు పలు సందర్భాల్లో చెప్పిన మాటలను దేశ ప్రజలు మననం చేసుకుంటున్నారు.