Asianet News TeluguAsianet News Telugu

video news : వచ్చే శతాబ్దానికల్లా యేటా పదిహేను లక్షల మరణాలు

గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు ఇలాగే కొనసాగితే అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే శతాబ్దానికి దేశంలో యేటా పదిలక్షల మంది మరణిస్తారని ఓ కొత్త అధ్యయనం అంచనా వేస్తోంది.

First Published Nov 5, 2019, 11:54 AM IST | Last Updated Nov 5, 2019, 11:54 AM IST

గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు ఇలాగే కొనసాగితే అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే శతాబ్దానికి దేశంలో యేటా పదిలక్షల మంది మరణిస్తారని ఓ కొత్త అధ్యయనం అంచనా వేస్తోంది. 

చికాగో యూనివర్సిటీలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇండియాలోని వాతావరణ మార్పుల మీద ఓ పరిశోధన చేసింది. 2100 సం. వచ్చేసరికి దేశంలో యేటా 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేసింది.

అంతేకాదు దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంజాబ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తేల్చింది. ఇప్పటివరకు దేశంలో అత్యంత వేడిగా ఉండే రాష్ట్రంగా పంజాబ్ నమోదయ్యింది. ఇక్కడ వార్షిక వేసవి ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ గా నమోదవుతుంది.

ఉష్ణోగ్రతలు పెరిగితే దీంతోపాటే వేడి అధికంగా ఉండే రోజులూ పెరుగుతాయని తేలింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. 2010లో యావరేజ్ గా 1.62  వేడిగా ఉన్న రోజులుంటే 2100నాటికి ఈ యావరేజ్ 48.05 రోజులకు చేరనుంది. ఢిల్లీలో 22 రెట్లు ఎక్కువగా, హర్యానాలో 20 రెట్లు ఎక్కువగా అధికఉష్ణోగ్రతల రోజులు నమోదుకానున్నాయి. 

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, మామూలు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2100నాటికి యేటా పదిహేను లక్షల మరణాలకు దారి తీస్తుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. 

దేశంలో నేడు రకరకాల ఆరోగ్యకారణాలు, వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల వల్ల నమోదవుతున్న మరణాలసంఖ్య కంటే ఇది ఎంతో ఎక్కువ అని తేలింది.

అధిక ఉష్ణోగ్రతల వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ..ఈ ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే రెట్టింపు మరణాల సంఖ్య నమోదవుతుంది