Asianet News TeluguAsianet News Telugu

video:ప్రభుత్వంతో భాగస్వామ్యం.... మంత్రి మేకపాటితో హెచ్‌సీఎల్

అమరావతి: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటితో హెచ్ సీఎల్ ప్రతినిధుల భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది.  నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు.   

First Published Nov 12, 2019, 9:54 PM IST | Last Updated Nov 12, 2019, 9:54 PM IST

అమరావతి: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటితో హెచ్ సీఎల్ ప్రతినిధుల భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది.  నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. 

నైపుణ్య రంగంలో శిక్షణపరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.  తనతో జరిగిన భేటీలోని చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హెచ్ సీఎల్   క్యాంపస్ ని సందర్శించాలంటూ ప్రతినిధులు మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆహ్వానించారు.