video:ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీస్... అభినందించిన జగన్
అమరావతి: విజయవాడ బందరు కాలువలో ఆత్మహత్యయత్నం చేసిస మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అర్జునరావును సీఎం జగన్ అభినందించారు. కృష్ణలంకలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.లక్ష్మి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అర్జునరావు కాపాడారు.

ఇతడు సీఎం జగన్ కాన్వాయ్ పైలెట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు చేసిన మంచి పని గురించి తెలుసుకున్న సీఎం జగన్ ప్రత్యేకంగా అతన్ని కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.