సోహెల్ కి అవకాశాల వెల్లువ: భారీ బడ్జెట్ తో కొత్త సినిమా ప్రారంభం
బిగ్‌బాస్ 4 టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ సోహైల్ ఫైనల్ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు.
బిగ్‌బాస్ 4 టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ సోహైల్ ఫైనల్ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు. బిగ్‌బాస్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని పర్సనల్‌గా జాక్‌పాట్ కొట్టడంతోపాటు వేదికపై నాగార్జున, చిరంజీవి వంటి బిగ్ స్టార్స్ మనసులను గెలుచుకున్నాడు. అంతిమంగా అందరి హార్ట్ లను కొల్లగొట్టాడు. సోహైల్ పది లక్షలు ఇవ్వాలనుకున్న ఆర్ఫనేజ్‌కి తాను ఇస్తానని నాగార్జున తెలిపారు. అంతేకాదు అందరి ముందు వేదికపై సోహైల్‌ని నాగార్జున ఎత్తుకోవడం హైలైట్‌గా నిలిచింది.