IPL 2021 KKR VS RCB : పేకమేడలా కుప్పకూలిన కోహ్లీ & కో ... మోర్గాన్ సేన సునాయాస విజయం

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది.

Naresh Kumar | Asianet News | Updated : Sep 21 2021, 12:59 AM
Share this Video

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది. ఫేజ్‌2లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...  93 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్...  34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్ కాగా, వెంకటేశ్ అయ్యర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను 10 ఓవర్లలోనే ముగించాడు...  ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కి ఇదే అత్యంత వేగవంతమైన ఛేదన... ఇంతకుముందు 2011లో 13.5 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్..

Related Video