ఘర్షణ, గాలిలోకి కాల్పులు: గాయపడిన తిక్కారెడ్డి (వీడియో)

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ అభ్యర్థి  తిక్కారెడ్డి వర్గీయులకు, వైసిపి వర్గీయుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.

టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీడీపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

Share this Video

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి వర్గీయులకు, వైసిపి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీడీపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల తోపులాట జరిగింది. దీంతో తిక్కారెడ్డి గన్ మన్ రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. తిక్కా రెడ్డి కాలికి గాయమైంది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయపడ్డాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు భారీగా మోహరించారు.

Related Video