వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్... పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మరో మలుపు తిరిగింది.
కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు మరో మలుపు తిరిగింది. సునితా రెడ్డి భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం లేదని వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2019 మార్చి 13న గూగుల్ టేకౌట్ ప్రకారం తనతో శివశంకర్ రెడ్డి ఉన్నారని అనడంలో నిజం లేదన్నారు. ఆ రోజు వివేకా ఇంటి వాస్తు చూపించడానికి సూర్యనారాయణ అనే వాస్తు నిపుణుడిని పిలిచామని అన్నారు. కానీ శివశంకర్ రెడ్డి ఇంట్లో ఉన్నప్పడు తాను ఫోన్ చేశానని రాజశేఖర్ చెప్పడం సరికాదన్నారు. ఆ రోజు సూర్యనారాయణ, తాను మాత్రమే వున్నామని... మరొకరు లేరు, ఎవరికీ ఫోన్ చేయలేదని కృష్ణారెడ్డి స్పష్టం చేసాడు.