బాబూ ధైర్యం ఉంటే చెప్పు 100రోజుల్లో ఏ పథకానికి ఎంతిచ్చావ్‌

చంద్రబాబు తమది ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలును గుర్తుచేసేందుకు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'థాలీ బజావో' కార్యక్రమంలో పాల్గొని పళ్లెం, గంటెతో నిరసన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 20లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వరదలకు 7లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతుల పరిహారం మీద కోత పెట్టారని... తల్లికి వందనం పథకం అమలు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశక్తి పథకం కింద ఇచ్చే రూ.1500 ఎక్కడ..? ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారు..? అని ప్రశ్నించారు.

Share this Video

Related Video