నరసరావుపేటలో దారుణం... ప్రియురాలిని గొంతునులిమి చంపిన ప్రియుడు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు వద్ద ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. 

First Published Feb 24, 2021, 6:33 PM IST | Last Updated Feb 24, 2021, 6:33 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు వద్ద ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ సెకండీయర్ చదువుతున్న అనూష అనే యువతిని క్లాస్ మేట్ హర్షవర్ధన్ రెడ్డి హతమార్చాడు. మృతురాలు ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన యువతిగా, యువకుడిది వినుకండ నియోజకవర్గం బొల్లపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
ఈ రోజు(బుధవారం) కాలేజికి వెళ్లకుండా పాలపాడు రోడ్డు పొలాల వద్ద కలిసి మాట్లాడుకే తరుణంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే హర్షవర్ధన్ కోపంతో అనూష ని బలంగా కొట్టి, గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. హత్య అనంతరం లొంగిపోయాడు హంతకుడు విష్ణువర్ధన్ రెడ్డి.