ఎల్జీ పాలిమర్స్ విషాదం : వచ్చే నెల పుట్టిన రోజు.. కొత్త గౌను కావాలంది.. అంతలోనే..
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి గ్రీష్మ తల్లిదండ్రులు కంపెనీ గేటు ముందు ధర్నాకు దిగారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి గ్రీష్మ తల్లిదండ్రులు కంపెనీ గేటు ముందు ధర్నాకు దిగారు. చనిపోయిన సంగతి మూడు రోజుల తరువాత తెలిసిందని, వచ్చేనెల పాప పుట్టినరోజని కొత్త గౌను కొనియ్యమందని చెబుతున్న ఆమె మాటలు అందర్నీ కలిచివేశాయి. ఎల్జీపాలిమర్స్ ముందు ఈ దుర్ఘటనలో చనిపోయిన 5మంది మృత దేహాలతో స్థానికులు ధర్నాకు దిగారు. అడ్డువచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.