Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

Aug 24, 2021, 4:34 PM IST

విజయవాడ: అగ్రి గోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో పాటు వైసీపీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. మరో దఫా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సందర్బంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దుర్గ మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ అండగా నిలవడం ఆనందకరమన్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని సీఎం జగన్ మరోసారి నిరూపించారని... ఆయన చేస్తున్న మంచి పనులను పేద ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు. ఎన్నో సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలవడం చాలా గొప్పవిషయమన్నారు. 

Video Top Stories