Vaikunta Ekadashi: విజయవాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

Share this Video

వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో శాంతియుతంగా నిల్చుని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

Related Video