userpic
user-icon

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీయా, గుప్త నిధుల వేటనా?

Chaitanya Kiran  | Published: Dec 8, 2020, 11:29 AM IST

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్దిగాంచిన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పద్మనాభలో  అత్యంత ఎత్తైన గిరిపై వేంచేసిన అనంత పద్మనాభస్వామి  ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు ఆలయ ఇ.ఒ.లక్షీనారాయణశాస్ర్తి పద్మనాభం పోలీసుఅధికారులు సోమవారం ఫిర్యాదు చేశారు. అయితే స్వామి వారికి ఆరాధన కార్యక్రమాలు , రాజ్ బోగం చెల్లించడానికి ఆలయ అర్చకులు సీతారామాజనేయస్వామి ఆచార్యలు సోమవారం ఉదయం వెళ్లి చూడగా ఆలయ ముఖద్వారం తాలాలు పగల గొట్టి ఉండడంతో ఆయన ఖమగు తిన్నారు. అలాగే అదే ద్వారం వద్ద కింది భాగంలో రెండు రాళ్లు, అలాగే ఆలయం శిఖరంపైన మరో రెండు రాళ్లు పెకిలించారు. అయితే స్వామి వారి గర్బాలయంలోకి దుండగలు ప్రవేశించలేదు.

Read More

Must See