సైకో చేతిలో అంధ యువతి హత్య... మార్చురీ వద్ద వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న మహిళలు..

విజయవాడ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో సైకో చేతిలో దారుణ హత్యకు గురయిన అంధురాలు ఎస్తేరు రాణి మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు.

Share this Video

విజయవాడ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో సైకో చేతిలో దారుణ హత్యకు గురయిన అంధురాలు ఎస్తేరు రాణి మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు.ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్దకు చేరుకున్న పద్మ మృతురాలు తల్లి, పెద్దమ్మతో పాటు ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్న పద్మ మహిళా కమీషన్ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. 

అయితే వాసిరెడ్డి పద్మ వచ్చిన సమయంలోనే హాస్పిటల్ వద్దకు తాడేపల్లి మహిళలు, టిడిపి నాయకులు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఛైర్ పర్సన్ కారుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టారు. మహిళల పై జరుగుతున్న దాడులపై పద్మ స్పందించాలని... లేదంటే మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేసారు. ఇలా ఆందోళన చేపట్టిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంతో వాసిరెడ్డి పద్మ కూడా అక్కడినుండి వెళ్లిపోయారు. 

Related Video