Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నేతల తెంపల్లి పర్యటన ఉద్రిక్తత... గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు, హైటెన్షన్

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెంపల్లి గ్రామంలో డయేరియా ప్రబలి మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  

First Published Jul 21, 2022, 2:19 PM IST | Last Updated Jul 21, 2022, 2:19 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం తెంపల్లి గ్రామంలో డయేరియా ప్రబలి మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ద్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష టిడిపి నాయకులు తెంపల్లి వెళ్లడానికి సిద్దమయ్యారు. అయితే తెంపల్లి గ్రామానికి వెళ్లకుండా టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ముందస్తుగానే గ్రామాన్ని కంకిపాడు, పెనమనూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం స్టేషన్ల పోలీసులు చుట్టుముట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. టిడిపి నాయకులు తెంపల్లి గ్రామంలోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బారికేడ్లు పెట్టి ప్రతి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఆవుటుపల్లి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తెంపల్లి గ్రామంలో  హైటెన్షన్ చోటు చేసుకుంది.