Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో ఉద్రిక్తత... రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టిన తాగుబోతుల వివాదం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మద్యం మత్తులో చెలరేగిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. 

First Published Sep 19, 2022, 12:19 PM IST | Last Updated Sep 19, 2022, 12:19 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మద్యం మత్తులో చెలరేగిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గొడవ జరిగిన బలరాంపేటలో భారీగా బలగాలను మొహరించారు. ఇరు వర్గాలను నచ్చజెప్పి ఎలాంటి గొడవలు జరక్కుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మళ్లీ ఘర్షణ చెలరేగితే 144 సెక్షన్ విధించి మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు పోలీసులు తెలిపారు.