Asianet News TeluguAsianet News Telugu

మరో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు ... చిన్నపిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తూ శాడిజం

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయుడు వక్ర బుద్ది చాటుకున్నాడు. 

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయుడు వక్ర బుద్ది చాటుకున్నాడు. ముక్కుపచ్చలారని చిన్నారుల ముందు కామ బుద్ది ప్రదర్శించాడు. శ్రీకాకుళం జిల్లా నవగాం ఎంపిపి స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గొర్లె భానోజీరావు స్కూల్ లో తన సేడిజం ప్రదర్శించాడు. పాఠశాలకు వచ్చే బాలికలకు నీలిచిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. పేరెంట్స్ కు చెబితే కొడతానంటూ చిన్నారులను బెదిరించేవాడు. కీచక టీచర్ అరాచక చర్యలను భరించలేక విద్యార్థులు తమ బాధను తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామ పెద్దలతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుని నిలదీశారు. పాఠశాలలో పెట్టి బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీచర్ భానోజీరావు ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు...